Please complete Pending Payment

  మెంబర్ ఆఫ్ రాజ్యసభ నిధులను స్వాతంత్ర సమరయోధుల ఆశయాలు నెరవేర్చుటకు కేటాయించాలి- బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్..

  • స్వాతంత్ర సమరయోధుల ఆశయాలను నెరవేర్చుటకు కట్టుబడి ఉంటాం- రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య.

హైదరాబాద్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం భవన్ లో ఆంధ్ర ప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య గారిని మర్యాదపూర్వకంగా కలిసి స్వాతంత్ర సమరయోధుల ఆశయాలు నెరవేర్చుటకు నిధులు మంజూరు చేయాలని బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు.ఈ తరుణంలో రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కష్టపడి సాధించుకున్న స్వాతంత్రాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరిదీ అని కొనియాడుతూ స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ వారి ఆశయ సిద్దికై కట్టుబడి ఉంటానని సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తానని తెలియజేశారు. ఈ యొక్క సమావేశము లో పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మెదక్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీ సాయ గౌడ్, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద స్వతంత్ర సమరయోధుల ఆశయాల సాధనకై రిలే నిరాహార దీక్ష చేసిన ఫ్రీడమ్ ఫైటర్ కోవూరి మొగులయ్య గౌడ్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.

న్యూఢిల్లీ రాష్ట్రపతి భవన్ ను ఆశ్రయించిన మెదక్ పార్లమెంట్ జహీరాబాద్ పార్లమెంట్ కాంటెస్టెడ్ ఎంపీలు సంగారెడ్డి జిల్లా బీసీవై పార్టీ ఇంచార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మరియు జి సాయ గౌడ్.